తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడు లేనంతగా స్థాయిలో ఓటమిపాలైంది.  ఎప్పుడూ ఆ పార్టీకి ఈ స్థాయిలో ఓడిపోలేదు.  సరే గతం గతః అనుకోని ముందుకు పోతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతున్నది.  ఎన్నికలకు సంవత్సరం ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చింది. 

 

అలా బయటకు వచ్చిన టిడిపిపై సహజంగానే కోపంగా ఉంటుంది.  పైగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ కోపం మరింతగా పెరిగింది.  మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో.. టిడిపిపై పగ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది బీజేపీకి.  టిడిపి కేవలం 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 

 

ఎమ్మెల్యేలను పక్కన పెట్టి బీజేపీ ఎంపీలపై కన్నేసింది.  ఇందులో కేశినేని నాని ఇప్పటికే బీజేపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  రేపోమాపో పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.  వీరితో పాటు బీజేపీ మరికొంతమందిపై కూడా దృష్టిపెట్టింది.  దీనికి సంబంధించి అమిత్ షా ఢిల్లీలో చకచకా పావులు కదుపుతున్నారు. 

 

కేశినేని నానితో పాటు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి, టిజి వెంకటేష్, తోట రామలక్ష్మి తదితరులను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.  ఢిల్లీలో రాయభారం నడుస్తోంది.  రేపోమాపో ఇది అఫీషియల్ గా జరిగే అవకాశం కనిపిస్తోంది.  ఇదే జరిగితే.. టిడిపికి మరింత షాక్ తగిలినట్టే..


మరింత సమాచారం తెలుసుకోండి: