రాజకీయ వలసల కాలం మరోసారి ఊపందుకుంది. నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరిన సంగతిని వారు బాహాటంగా వెల్లడించారు. వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఫిరాయింపు దార్లను తమ పార్టీలోనికి తీసుకోమని బాహాటంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ నేపధ్యంలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి టీడీపీ ఎమ్మెల్యేలను కలుపుకునేందుకు సిద్దమైంది. 


చట్టం ప్రకారం, 2/3 శాతం సభ్యులు టీడీపీ నుంచి బీజేపీ లోకి మారారు కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు, వెంకయ్య నాయుడుకి ఒక ఇబ్బంది తప్పినట్లె, లేకుంటే శరద్ యాదవ్ మీద 2 రోజుల్లో చర్య తీసుకున్నట్లు టీడీపీ సభ్యుల మీద  అనర్హత వేటు వెయ్యవలసిన సంకటస్థితి ఎదుర్కోవలసి వొచ్చేది. 


భవిషత్తు రాజకీయలను అంచనా వెయ్యగల మరి కొందరు చెప్తున్న మాటల ప్రకారం 15 మంది టీడీపీ MLA లు కూడా మూకుమ్మడిగా పార్టీని వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శాసనసభలో మా గొంతు వినిపిస్తామంటున్న బీజేపీ నేతల మాటల వెనుక ధైర్యం ఇదే కావొచ్చు. టీడీపీలో ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలుండగా వారిలో 15 మంది పార్టీ ఫిరాయిస్తే ఇక 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి మిగులుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: