తెలంగాణ కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ ఇమేజ్ నుదెబ్బ తీసేలా వ్యవహరించిన మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ఆ పార్టీలో ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలో టీఆర్ ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా చెప్పిన ఆయన వ్యాఖ్యలపై పీసీసీ ఆగ్రహం చెందటమే కాదు షోకాజ్ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. రాజగోపాల్ త్వరలో బీజేపీలోకి చేరిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరేలా ఉత్తమ్ వ్యాఖ్యలున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడి వెళుతున్నారన్న విషయం తనకు తెలుసన్నారు.  ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాజకీయ కారణాలతో పార్టీ మారే వారికి సంబంధించి ఏదైనా చెప్పొచ్చని.. కానీ ఆర్థికపరమైన కారణాలతో వెళ్లే వారికి ఏం చెప్పగలమని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.


రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో పార్టీ వీడుతున్నట్లుగా తనకు తెలీదని ఆయన చెప్పారు.చెప్పినట్లే చెప్పేసి.. తనకు తెలీదని చెప్పటం ద్వారా ఉత్తమ్ రాజగోపాల్ ఎందుకు పార్టీని వీడిపోతున్నారన్న విషయాన్ని చెప్పేసినట్లేనని అనుకోవాలా?  ఇంతకీ ఉత్తమ్ ఢిల్లీ పర్యటన.. అధినాయకత్వానికి తెలంగాణలో పార్టీ తాజా పరిస్థితి గురించి వివరించటానికే వెళ్లారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: