తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఒట్టు తీసి గట్టి మీదే పెడుతుంది. అందుకే ఆ పార్టీ ఒట్టులన్నీ ఓట్ల కోసమేనని జనాలకు తెలిసిపోయింది. ఇప్పటికి అనేకమార్లు యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు రేపటి రాజకీయం కోసం  మరిన్ని యూ టర్నులకు సిధ్ధమవుతున్నారు.


అందులో భాగంగా ఆయన ఇప్పటి నుంచే 2014 పొత్తులకు ప్రిపేర్ అవుతున్నారు. దీని కోసం దీర్ఘకాలిక వ్యూహాలకు రెడీ అవుతున్నారు. తన వాళ్లనుకున్న వారు బీజేపీలో చేరడంతో బాబు పని బాగా సులువు అవుతోంది. రేపటి రోజున ఏపీ బీజేపీలో మాజీ టీడీపీ నాయకులే పెత్తనం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. 


దాంతో కమలంతో మళ్ళీ దోస్తానా అంటూ బాబు గారు 2024లో పోటీకి తయారైపోవచ్చు. జగన్ని ఈ అయిదేళ్ళలో సవ్యంగా పాలన  ఛేయ‌నీయ‌కుండా అడ్డుపుల్ల వేయవచ్చు. ఇలా బీజేపీలో చేరారో లేదో అలా ప్రత్యేక హోదాకు మమ అనేశారు సుజనా చౌదరి గారు. అది ముగిసిన అధ్యాయమని ఆయనే అన్నాక ఇక కమలనాధులకు వేరే పనేముంది. సో జగన్ ఎంత బీరాలు పలికినా హోదా తేలేరు. అదే రేపటి ఎన్నికల్లో టీడీపీకి తురుపు ముక్క అయినా అవొచ్చు. మొత్తానికి బాబు గారు ఓడినా కూడా పోరాటయోధుడిగా మళ్ళీ రంగంలోకి వచ్చేస్తున్నారు అదీ మ్యాటర్.



మరింత సమాచారం తెలుసుకోండి: