టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ఈ చేరికలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అటు టీడీపీని వీడిన ఎంపీలపై.. బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి కార్యకర్తలు, ప్రజలే అండఅని,  నలుగురు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదని.. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక హోదా కోసం బీజేపీతో టీడీపీ పోరాడిందని.. అది మనసులో పెట్టుకుని ఈ విధమైన దుశ్చర్యలకు బీజేపీ పాల్పడటం గర్హనీయమని నారా చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు.

తెలుగుదేశం పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన తెదేపాలో నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారని మీడియాలో వస్తోన్న వార్తల నేపథ్యంలో సీనియర్‌ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా భాజపాతో పోరాడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.


బీజేపీ తో విభేదించడానికి కారణం AP కొరకు ప్రత్యేక హోదాను సాధించడమే, ఇది విభజన తరువాత పోస్ట్‌లో మిగిలిపోయింది. ఏపీ మరియు దాని కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ద్రోహం చేస్తున్నప్పుడు బిజెపితో స్నేహంగా ఉండడం నాకు చాలా సులభం. నేను అలా చేయలేదు. నా జీవితమంతా, నేను ప్రజల మంచి కోసం కృషి చేశాను మరియు అధికారంలో ఉన్నా లేకపోయినా అలా కొనసాగిస్తాను. ఈ రోజు బీజేపీలో చేరిన టీడీపీ ఏంపీలు ఏపీ హక్కుల కోసం నా పోరాటం ఫలితమే. వారు పరిష్కరించడానికి వారి స్వంత వ్యక్తిగత అజెండాలను కలిగి ఉన్నారు.. ఈ సంక్షోభ పరిస్థితులు నాకు కొత్తవి కావు, పార్టీకి కొత్తవి కావు. అంతకుముందు టీడీపీ చనిపోయిందని చాలామంది చెప్పారు. చాలా మంది టీడీపీ క్లోజ్డ్ చాప్టర్ అన్నారు. చాలా మంది నాయకులు పార్టీని విడిచిపెడుతున్నారని, అది పోయి ఖననం చేయబడుతుందని అన్నారు. మేము ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మేము తిరిగి వచ్చాము. మా వెనుక లక్షలాది కార్యకార్తలు, కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. చరిత్ర కూడా పునరావృతమవుతుంది. ఆందోళన చెందడానికి ఏమీ లేదు అంటూ ట్వీటర్ ద్వారా చంద్రబాబు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: