ఇప్పటివరకూ మోడీ అంటే నీతి నిజాయతీకు మారు పేరు అని అంతా భావించేవారు. ఆయన విధానాలు నచ్చని వారు సైతం మోడీ అవినీతి మరక లేని వారు అని ఒప్పుకుంటారు. అటువంటి మోడీ నాయకత్వంలోని బీజేపీ టీడీపీ రాజ్యసభ సభ్యులను టోకున కొనేశాక మోడీ పరువు గంగలో కలసిపోయింది. మోడీ అంటే ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా గాల్లో కలసిపోయింది.


రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేసుకున్న తీరు దేశంలో ఫిరాయింపుల కంపు ఎంత వుందో చూపించింది. ఈ నలుగురు టీడీపీ ఎంపీలు లేకపోతే బీజేపీకి అధికారం ఉండదా. ఎందుకింత కక్కుర్తి, ఎందుకింత హడావుడి. కడుపు నిండా కూడు పెడితే పక్క ఇంట్లో దొంగతనంగా అన్నం తిన్న చందంగా నిన్నటికి నిన్న 303 సీట్లు ఒక్క బీజేపీకి, మిత్రులకు మరో యాభై సీట్లు ఇచ్చి మరీ గౌరవంగా పాలన చేయమంటే ఈ గోడ దూకుళ్ళను ప్రోత్సహించడం ఏంటి అని జనం తిట్టుకుంటున్నారు.


కమలం ఏపీలో బలపడాలంటే ఇదే మార్గమా. చెప్పే నీతులు ఇంతేనా అని కూడా మేధావులు అంటున్నారు. మోడీ గ్లామర్ తో ఏపీలో ఓట్లు తెచ్చుకోలేమని తేలిపోయిందా అని కూడా అంటున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ జనం బీజేపీని నెత్తిన పెట్టుకునే వారే కదా. అది కూడా కొండ మీద కోతి కాదు కదా. మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేరిస్తే దర్జాగా జనామోదం లభిస్తుంది కదా. అవన్నీ మానేసి అవినీతి ఆరోపణలు ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని మోడీ సైతం ఆ మకిలి అంటించుకున్నారని యావత్తు దేశం బావురుమంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: