ప్రత్యేక హోదా కోసం జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ మాత్రం ప్రత్యేక హోదాను మాత్రం మరిచి పోలేదు. అయితే .కొన్ని వాదనలు.. వాదాలు మొదట్లో పెద్దగా పట్టవు. కానీ.. అదే పనిగా ప్రస్తావిస్తున్నప్పుడు వాటికొచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు.


ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా మీద ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఎంతో సాహసోపేతమైన చర్యగా చెప్పక తప్పదు.ఎందుకంటే.. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నది లేదు. కాంగ్రెస్ ఏ రోజూ తెలంగాణ ఇవ్వనని చెప్పింది లేదు. కానీ.. హోదా విషయంలో వ్యవహారం కాస్త వేరు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ ప్రతి వేదిక మీద మాట్లాడుతున్న జగన్.. ఇప్పుడు ఏపీ సీఎం.


ఇదంతా ఒక ఎత్తు అయితే.. హోదా అన్నది ముగిసిన కార్యక్రమంగా బీజేపీ ఇప్పటికే వందసార్లు చెప్పేసింది. ఆ మాట చెప్పిన తర్వాత ఎన్నికలకు వెళ్లింది కూడా. ఇలాంటప్పుడు హోదా విషయమై అదే పనిగా ప్రస్తావించే వారిపై మోడీకి కోపం రావటానికి ఎక్కువ అవకాశం ఉంది. మోడీ లాంటి నేతకు తనకిష్టం లేని అంశాల్ని అదే పనిగా ప్రస్తావించటాన్ని అస్సలు ఇష్టపడరు. ఆయనకు కోపం వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: