సినీరంగంలోకి రాకముందు తిరుపతిలో ఉన్న రోజా.. సినిమా రంగానికి వచ్చిన తరువాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది.  2014 ఎన్నికల్లో గెలిచిన సమయంలో నగరి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నగరిలో ఇల్లు తీసుకుంది.  


అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాటం చేసింది.  ఇదిలా ఉంటె, గత ఎన్నికల్లో రోజా విజయం సాధించడమే కాకుండా ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్ట్ ఇవ్వడంతో రోజా అమరావతికి దగ్గరలో ఉన్నడాల్సిన అవసరం ఏర్పడింది.  


అంతేకాకుండా, ఆమెకు నవరత్నాల అమలుకు సంబంధించిన పోస్ట్ ను కూడా ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో.. ఆమె అమరావతికి మరింత దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.  దీంతో రోజా హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం ను మార్చేసింది.  


విజయవాడలో ఇల్లు కొనుగోలు చేసి.. అక్కడే ఉండేందుకు నిర్ణయం తీసుకుంది.  అమరావతికి దగ్గర ఉండటం వలన ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది.  రేపు మర్నాడు ఏదైనా అవకాశం వస్తే మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉండొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: