ఏపీ సీఎం వ్యవహార శైలి మోడీకి కోపం తెప్పిస్తుందా .. పదే పదే  ప్రత్యేక హోదా కోసం జగన్ మాట్లాడటం మోడీకి నచ్చడం లేదా అంటే దీనికి సమాధానము అవుననే చెప్పాలి. ప్రత్యేకహోదా అంశం గురించి అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటామని ఏపీ శాసనసభలో అలా ప్రకటన చేసి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి - ఢిల్లీలో తన వాయిస్ వినిపించడానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అంశం గురించినే మాట్లాడుతూ ఉన్నట్టున్నారు.


అసలు  సందర్భం  కాకపోయినా జగన్ మోహన్  రెడ్డి ప్రత్యేకహోదా అంశం గురించినే మాట్లాడుతూ ఉండటం గమనార్హం. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ సందర్భంగా తన ప్రసంగంలో జగన్ మోహన్  రెడ్డి  ప్రత్యేకహోదా  అంశం గురించి ప్రస్తావించారు. వాస్తవానికి ఆ మీటింగ్ జరిపింది ఈ అంశాల గురించి చర్చకు కాదు. దేశ వ్యాప్తంగా ఒకే సారి లోక్ - రాజ్యసభ ఎన్నికలు జరపడానికి - మహాత్మగాంధీ నూటా యాభైయవ జయంతి వేడుకల  నిర్వహణకు - తదితర అంశాల గురించి చర్చించడానికి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


జానీ జగన్ మాత్రం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటానికి సందర్భం అది కాకపోయినప్పటికీ మోడీ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో మోడీ ఒకింత అసహనానికి లోనౌతున్నారు. బీజేపీ .. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయనం చెప్పినప్పటికీ జగన్ మాత్రం తన పోరాటాన్ని ఆపడం లేదు. అయితే జగన్ వ్యవహార శైలితో మోడీ .. అమితాషా తో జగన్ తో కష్టమేనని వ్యాఖ్యానించినట్టు సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: