తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన అంతా డ్రామాయేనా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళగానే పార్టీలోని నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి చేరటం యాధృచ్చికమేనా ?

 

చాలామంది అలా అనుకోవటం లేదు. ఎంపిల ఫిరాయింపుకు చంద్రబాబు విదేశీ ప్రయాణానికి మధ్య ఏదో లింక్ ఉందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా అనుమానించారు. నలుగురు ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లు బిజెపి చేరే విషయం గురువారం బయటపడినా అంతకు వారం క్రితమే ఈ డ్రామాకు తెరలేచింది. ఈ విషయాన్ని టిజి వెంకటేష్ చెప్పిన మాటలను బట్టే అర్ధమవుతోంది.

 

వారం రోజుల  క్రితమే తాను బిజెపిలో చేరుతున్న విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడినట్లు టిజి చెప్పారు. అంటే నలుగురు ఎంపిలు పార్టీ మారుతున్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసు. అయితే ఆ సమయంలో తాను దేశంలో ఉంటే బాగుండదన్న ఉద్దేశ్యంతోనే విదేశాలకు వెళ్ళినట్లు డ్రామాలాడుతున్నారని ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.

 

అదే సమయంలో దాదాపు నాలుగు రోజుల క్రితమే మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి గురించి మాట్లాడుతూ సుజనా డ్యామేజింగ్ ప్రకటనలు చేశారు. ఓటమిపై ఏ నేత కూడా బహిరంగంగా తప్పుపట్టకపోయినా సుజనా మాత్రం చంద్రబాబు, నారా లోకేష్ ను మీడియా ముందే తప్పుపట్టారు. అప్పుడే అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి సుజనా బిజెపిలో చేరుతున్నట్లు.

 

గతంలో తెలంగాణాకు సంబంధించి రేవంత్ రెడ్డి అండ్ కో ను కూడా చంద్రబాబే కాంగ్రెస్ లోకి పంపారనే ప్రచారం అప్పట్లో బలంగా జరిగింది. దానికి తగ్గట్లే అప్పటి పరిణామాలు కూడా జరిగాయి. ఇపుడు అలాంటి పరిణామాలే ఏపిలో కూడా మొదలయ్యాయి. దాన్నిబట్టి చూస్తే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి చేరటం అంతా చంద్రబాబు ఆలోచనల ప్రకారమే జరుగుతోందనే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: