ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం 4 లక్షల గ్రామ వాలంటీర్ల పోస్టులకు అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఐదు వేల రుపాయల గౌరవ వేతనంతో ప్రతి 50 ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ చొప్పున నియమించబోతున్నారు. గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన వారు ప్రభుత్వం యొక్క పథకాలను అర్హులైన ప్రజలకు చేరుస్తారు. 
 
గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. దీన్ని ఆసరాగా చేసుకోని కొంతమంది గ్రామ వాలంటీర్లకు ధరఖాస్తు చేసుకోవాలని నకిలీ వెబ్ సైట్లను సృష్టిస్తున్నారు. ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా అభ్యర్థుల యొక్క ఆధార్, పాన్, పోన్ నంబర్ మరియు ఇతర ముఖ్యమైన సమాచారం సైబర్ మోసగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. 
 
అందువలన గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురుచూడాలి. ప్రభుత్వం తరపున ధరఖాస్తు చేసుకోమని చెప్పేదాకా వేచి ఉండాలి. ఈ మోసగాళ్ళ బారిన పడితే మాత్రం ఏదో ఒక రకంగా మోసపోవడం మాత్రం ఖాయం. ధరఖాస్తు చేసే ముందు అది నకిలీ వెబ్ సైటో అసలు వెబ్ సైటో అనే విషయాన్ని గుర్తించి ధరఖాస్తు చేసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: