అవును వైసిపిలో అదే విధమైన చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బిజెపిలో చేరారు. మిగిలిన ఇద్దరు ఎందుకు చేరలేదంటే వాళ్ళ వల్ల బిజెపికి ఏ విధంగా కూడా లాభం లేదు కాబట్టే వదిలేసింది.

 

సరే నలుగురు ఎంపిలు బిజెపిలో చేరిన విషయం చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందనే చర్చల్లో జోరందుకున్నాయి. సరే టిడిపి సంగతి పక్కనపెడదాం. టిడిపి ఎంపిలు బిజెపిలో చేరితే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా నష్టం ? ఏ విధంగా అంటే ఇపుడు బిజెపిలో చేరిన ఎంపిల్లో ముగ్గురికి జనబలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవను కూడా గెలవరు.

 

ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబే వైసిపి అధ్యక్షుడు జగన్ ను తట్టుకోలేక చేతులెత్తేశారు. ఇక మిగిలిన వాళ్ళు జగన్ ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం కూడా చేయలేరు. అందుకే అందరూ కూడబలుక్కునే బిజెపిలో చేరారు.  ఇపుడు వీళ్ళు బిజెపిలో చేరారు కాబట్టి కేంద్రం నుండి ఏపికి రావాల్సిన సాయాన్ని ఆపినా ఆపేస్తారు.

 

పైగా ప్రత్యేకహోదా అన్నది జగన్ టార్గెట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని గనుక కేంద్రం ఇచ్చేస్తే రాష్ట్రంలో టిడిపికి భవిష్యత్తు కూడా ఉండదేమో. ఏపి రాజకీయాల్లో టిడిపిని కూలదోసి బిజెపి ఎదగాలని చూస్తోంది. అంటే రేపటి ఎన్నికల్లో వైసిపికి ప్రధాన ప్రత్యర్ధి బిజెపినే అవుతుందన్న విషయం గ్రహించాలి. టిడిపిలో ఉండి జగన్ ఏమీ చేయలేని వీళ్ళంతా బిజెపిలో చేరి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

రాష్ట్రం పరిధిలో ఉండే అంశాల్లో వీళ్ళు జగన్ ను అడ్డుకునే అవకాశం ఏమీ లేదు. అందుకనే వీళ్ళ దృష్టి కేంద్రంపైకి మళ్ళింది. అంటే ఇటునుండి కుదరనిపని అటునుండి నరుక్కు వద్దామని అనుకుంటున్నట్లు అర్ధమైపోతోంది. ప్రస్తుత పరిస్ధితి చూస్తే రాష్ట్రం ప్రతి విషయంలోను కేంద్రంపై ఆధారపడక తప్పదు. జగన్ అడిగినదంతా ఇచ్చేసి బిజెపి తన నెత్తిన తానే చేతులు పెట్టుకుంటుందా ?

 

నేరుగా ఇటు బిజెపి అయినా అటు టిడిపి అయినా జగన్ ను ఎదుర్కొనే ముచ్చట లేనేలేదు. అందుకనే ముందుగా టిడిపిలోని కీలక నేతలను బిజెపిలోకి పంపితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ రెండు పార్టీలు కలిసిపోయి జగన్ పై యుద్ధాన్ని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకనే జగన్ ను ముందు టైట్ చేయాలన్న కండీషన్ మీదే టిడిపి ఎంపిలు బిజెపిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో


మరింత సమాచారం తెలుసుకోండి: