2019 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఎంతమాత్రం కలిసిరాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది తెలుగుదేశం పార్టీ. 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ సీట్లలో గెలిపొందినా టీడీపీ పార్టీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘోరమైన ఫలితాన్ని పొందింది. ఆరుగురు రాజ్య సభ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఈ ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీజేపీలోకి పార్టీ ఫిరాయించారు. 
 
మిగతా ఇద్దరూ కూడా అతి త్వరలోనే బీజేపీలోకి చేరుతున్నట్లు సమాచారం. ఈ పార్టీ ఫిరాయింపులు ఎంపీలతోనే ఆగిపోలేదు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చుస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలోకి వెళ్ళాలని అనుకున్నారు. కానీ వైసీపీ పార్టీలోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరలా ఉపఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి బీజేపీ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేరబోతున్నారు. 
 
టీడీపీ నుండి బీజేపీ పార్టీలోకి వెళ్ళటానికి ఐదు మంది ఎమ్మెల్యేలు సిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ఇదే జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఈ పార్టీ ఫిరాయింపులు ఆపడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి 



మరింత సమాచారం తెలుసుకోండి: