తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన కాలేశ్వరం ప్రాజెక్ట్ పండుగ సందర్భంగా తెలంగాణలో సంతోషాలు అంబరాన్ని అంటుతున్నాయి.  వేల ఎకరాలకు సాగు నీటిని అందించే బృహత్కర ప్రాజెక్ట్ కావడం..రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. ప్రంపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం, భారత దేశానికే గర్వకారణం.

కేవలం మూడేళ్లలోనే అతి స్వల్ప వ్యవధిలో తెలంగాణ ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్,  మహరాష్ట్ర సీఎం దేవేంద్ర వడ్నవీస్, ఏపి సీఎం జగన్ మెహన్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మేడిగడ్డకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమానికి ముందే చేరకున్న కేసీఆర్ జల సంకల్ప హోమంలో పాల్గొన్న వేళ, జగన్ వచ్చారన్న సమాచారాన్ని అధికారులు ఆయనకు అందించారు.

దీంతో ఆయన ఎదురెళ్లి, జగన్ మెడలో శాలువా వేసి, యాగ మండపం వద్దకు తీసుకెళ్లారు. జగన్ తో పాటు ఏపీ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, జగన్ లతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: