2009లో తన తండ్రి దివంగత ప్రియతమ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీని వీడిన అయన తనయుడు వైఎస్ జగన్, ఆ తరువాత 2011లో సొంతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొలిపిన విషయం తెలిసిందే. అయితే పార్టీ పెట్టిన మొదట్లో, ఇది ఎక్కువ కాలం నిలవదని, మున్ముందు పార్టీని నడపలేక, కొన్నాళ్ళకు వేరొక పెద్ద పార్టీలో జగన్ తన పార్టీని విలీనం చేస్తారు అంటూ అప్పట్లో పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే వాటన్నిటినీ లక్ష్యపెట్టకుండా ముందుకు సాగిన జగన్, గతంలో జరిగిన నవ్యాంధ్ర 2014 ఎన్నికల్లో తమ వైసిపి పార్టీని ఒంటరిగా బరిలో నిలిపి 67 సీట్లను గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. అయితే ఓటమిని ఎంతో సాదరంగా ఆహ్వానించిన జగన్, అక్కడినుండి పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడానికి నిర్ణయించారు. 

అయితే మధ్యలో ఆయనమీద కొన్ని కేసులు పెట్టబడి, వాటివలన అయన కొన్నాళ్ళు జైలుపాలైనప్పటికీ, బయటికొచ్చిన అనంతరం మొక్కవోని దీక్షతో ప్రజాసంకల్పయాత్ర పేరుతో యాత్ర చేసి, ప్రజలవద్దకు వెళ్ళి వారిసమస్యలను నిశితంగా తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే, ఎటువంటి పనులు చేస్తుందో నవరత్నాల రూపేణ ఒక మ్యానిఫెస్టో తయారు చేసి ప్రజలకు వివరించారు. అయితే అనంతరం ప్రజల మనసులు గెలుచుకున్న జగన్, మొన్నటి 2019 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక సీఎం అయిన దగ్గరినుండి అన్నివిధాలుగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అలానే, తాము మాటిచ్చినట్లుగా నవరత్నాలను అన్నివిధాలుగా అమలుచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇక కొన్ని రాజకీయ వర్గాలనుండి అందుతున్న సమాచారం ప్రకారం, సీఎం జగన్ రాబోయే 2024లో కూడా తమ వైసిపి పార్టీ అధికారాన్ని చేపట్టేలా ఇప్పటినుండే అన్నివిధాలుగా ప్రణాళికలతో కొన్ని అస్త్రాలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక వారు చెప్తున్న వివరాల ప్రకారం, గతంలో అయన తండ్రిగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రిఎంబర్స్మెంట్, 108 సేవలు వంటి వాటిపై ఇప్పటినుండే గట్టిగా దృష్టిపెట్టనున్నారట జగన్. 

అంతేకాక అమ్మఒడి పధకం, అలానే ప్రతిఒక్క పేదవాడికి సొంత ఇంటికల నెరవేరేలా ఎటువంటి మోసాలు జరుగకుండా నిజం చేయాలనీ చూస్తున్నారట. ఇక అలానే రైతులకు, ఉద్యోగులకు అన్నివిధాలా మేలు చేసి, వారి సమస్యలు పూర్తిగా తీర్చేలా వ్యవహరించాలని, ఇక వృద్ధులకు పెన్షన్లు, యువతకు ఉపాధి అవకాశాలు వంటివాటిని కూడా ఎటువంటి అక్రమాలు జరుగుగకుండా అమలు చేయాలనీ భావిస్తున్నారట. అన్నిటికంటే ప్రధానంగా తాము వేసుకున్న ప్రణాళిక ప్రకారం మధ్య నిషేధాన్ని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కొన్ని దశలవారీగా పూర్తిగా అమలుచేసి, ప్రజల మెప్పుతో మరొక్కమారు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే జగన్ గారు వేసుకున్న ఈ ప్రణాళికల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా చూస్తే మాత్రం, ఈ అస్త్రాలు వైసిపి పార్టీకి రాబోయే ఎన్నికలకు బాగా పనిచేస్తాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: