తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ గా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అపాయింట్ అయ్యారు. శుక్రవారం ఉదయమే వైవి నియామకానికి సంబంధించిన ఫైలుపై జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. అంటే ఛైర్మన్ గా వైవి నియామకం అయిపోయినట్లే. అందుకే ఆయన శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు.

 

బోర్డు సభ్యులు లేకుండా ఛైర్మన్ మాత్రమే నియమితులు కావటం బహుశా ఇదే తొలిసారేమో. మామూలుగా ఏ ప్రభుత్వంలో అయినా ఛైర్మన్ తో పాటు బోర్డు సభ్యులను కలిసే నియమిస్తారు. కానీ ఇపుడు జగన్ మాత్రం ప్రస్తుతానికి ఒక్క ఛైర్మన్ ను మాత్రమే నియమించారు. బోర్డు సభ్యులను మరో రెండు మూడు రోజుల తర్వాత నియమిస్తారని సమాచారం.

 

ఒంగోలు మాజీ ఎంపి అయిన వైవి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. సీట్ల సర్దుబాటులో టికెట్ ఇవ్వటం కుదరలేదు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యత, అభ్యర్ధులను సమన్వయం చేసే బాధ్యత వైవికే జగన్ అప్పగించారు.  జగన్ కు వరసకు బాబాయ్ అయ్యే వైవి రాజ్యసభ సభ్యత్వం అడిగారట. కానీ అందుకు అవకాశం లేకపోవటంతో ప్రస్తుతానికి టిటిడి ఛైర్మన్ ఇచ్చారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: