కాలం అనుకూలించకపోతే... ఎంతవారలైనా తలక్రిందులు కావాల్సిందే.  ఇబ్బందులు పడాల్సిందే.  ఇబ్బందులను సైతం ఎదుర్కొని కొంతమంది నిలబడతారు.  నిలబడి ఎదుగుతారు.  గెలవడంతో ఉన్న మజా వాళ్లకు బాగా తెలుసు.  అందుకే ఎదగడానికి వీలైనంతగా ప్రయత్నం చేస్తుంటారు. 

 

ఇప్పుడు టిడిపి కి చెందిన 16 మంది ఎమ్మెల్యేల బీజేపీ లో జాయిన్ అవుతున్నారని టాక్ వచ్చింది. రావడమే కాదు.. ఈరోజే వీళ్లంతా జాయిన్ అవుతున్నారని సమాచారం.  ఇలా వీళ్ళు జాయిన్ అవుతున్నారు అని తెలియగానే తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. 

 

కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా టిడిపి సభలో ఉండగలుగుతుందా.. ఒకవేళ ఉంటె.. సభలో చంద్రబాబు ఉంటారా.. సభకు వస్తారా అన్నది సందేహం.  మరికొంతమంది నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రతిపక్ష హోదా లేకుండా బాబుగారు సభలోకి వెళ్లలేరని, అందుకే రాకీయాల నుంచి రిటైర్మెంట్ కావాలని చూస్తున్నారని సమాచారం. 

 

అయితే, రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడు రిటైర్ అవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.  ఒకవేళ బాబు రిటైర్మెంట్ తీసుకుంటే..ఆ స్థానాన్ని భర్తీ చేసే సామర్ధ్యం ఉన్న నాయకుడు ఎవరు.. ఎవరికి  ఆ స్థానం ఇస్తారు న్నది తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: