ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం మధ్యాహ్నం దాదాపు 12.20 నిమిషాలకు పోలవరం చేరుకున్నారు. తొలుత హెలికాప్టర్‌లో మూడు సార్లు కలియదిరిగి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం, పశ్చిమగోదావరి కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు సీఎం వెంట హెలికాప్టర్‌లో వచ్చారు. తొలుత వ్యూ పాయింట్‌ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.

 

పోలవరం ప్రాజెక్టును 2021 జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన, సమీక్షల అనంతరం జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌, వ్యవసాయ శాఖ మంత్రి   కురసాల కన్నబాబులు విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

 

ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న వారికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే భూములు సేకరించి అప్పటి ధరలకు అనుగుణంగా పునరావాస సాయం అందించారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా అందరికీ లబ్ధి కలిగేలా పునరావాస ప్యాకేజీ త్వరలో ప్రకటించనున్నారు. వైఎస్‌ హయాంలో సేకరించిన భూములకు ఎకరానికి అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నారని సమాచారం.

 

019 నవంబరులో ప్రారంభించి 12 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి మరింత గడువిచ్చారు. 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టులో ఏ పనీ పెండింగులో లేకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేద్దామన్నారు. అధికారులు చెప్పినదాని కన్నా ఎక్కువ సమయం ఇచ్చినందున ఆ గడువు తప్పకూడదని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: