ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు విపరీతంగా కృషి చేశారు.  కానీ, ఆ కృషి ఫలించలేదు.  కేవలం 23 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 23 మంది ఉన్నా సరే పోరాటం చేస్తాం.  ప్రభుత్వాన్ని వదిలే సమస్యలేదు.  ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల తరపున పోరాటం చేస్తామని అన్నారు. 

 

రెండు మూడు రోజులు ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టారు.  చేయాల్సిన పనుల గురుంచి వివరించారు.  అంతా సవ్యంగా ఉంది అనుకునే బాబు అమెరికా వెళ్లారు.  అలా వెళ్ళగానే ఇక్కడ చకచకా పరిణామాలు మారిపోయాయి.  ఒక్కొకరుగా టిడిపి నుంచి మూటముళ్ళు సర్దుకోవడం మొదలుపెట్టారు. 

 

నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు.  రేపోమాపో లోక్ సభ ఎంపీలు కూడా పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటె, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.

 

ఒకవేళ ఇదే జరిగితే.. అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్షంగా ఉంటుంది.  టిడిపి ఆ హోదాను కోల్పోతుంది.  కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే  బాబు అసెంబ్లీకి వస్తారంటారా.  లేదా అన్నది అందరిలోనూ ఒక డౌట్ క్రియేట్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: