కేంద్రంతో సఖ్యత ఏ ప్రభుత్వానికైనా అవసరం, మన రాజ్యాంగంలో కేంద్రానికి విశేష అధికారాలు ఇచ్చారు. సమాఖ్య వ్యవస్థ‌లో ఇచ్చి పుచ్చుకునే వైఖరితో పోవాలని ఉన్నా అత్త పెత్తనం మాత్రం కేంద్రం చేస్తూనే ఉంటుంది. రాష్ట్రాలకు తానే పెద్ద బాస్ అనుకుంటుంది.


ఇక ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేయగానే కేంద్రంతో సఖ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఏపీ దారుణంగా విభజనతో నష్టపోయిన రాష్ట్రం. కేంద్ర సాయం ఇపుడు తప్పనిసరి. ఈ సమయంలో తగవులు కంటే రాజీతోనే పనులు చేయించుకోవాలన్నది జగన్ ఆరాటంగా ఉంది. అయితే ఈ ముచ్చట ఎక్కువ రోజులు సాగుతుందా అన్నదే ఇపుడు అందరికీ వస్తున్న డౌట్. టీడీపీకి చెందిన నలుగులు ఎంపీలను తీసుకున్న బీజేపీ ఏపీలో వాపును చూసి బలం అనుకుంటోంది. మాదే రేపటి రోజు అంటూ కాలరెగరేస్తోంది.


ఇక ఏపీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోవాలని చూస్తోంది. కేంద్రంలో విలీనానికి అక్కడ బీజేపీ వారే ఉండడంతో సమస్య లేదు. ఇక్కడ ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు బీజీపీలో విలీనం అంటే జగన్ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. స్పీకర్ తమ్మినేని సీతారాం విచక్షణకే జగన్ ఈ విషయం వదిలేశారు. ఆయన కనుక ఇది విలీనం కాదు, ఫిరాయింపేనని తేల్చి మొత్తానికి మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే పరిస్థితి ఏంటి. ఇదే బెంగ ఇపుడు బీజేపీ పెద్దలకు పట్టుకుంది. ఒకవేళ అలా జరిగితే జగన్ తో డైరెక్ట్ ఫైట్ కి బీజేపీ రెడీ అవడం ఖాయం, 



మరింత సమాచారం తెలుసుకోండి: