ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీడీపీ,వైసీపీ, జనసేన పార్టీల మద్య యుద్దం పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య మాటల యుద్దం మామూలుగా జరగలేదు.  సామాన్య కార్యకర్తల నుంచి అధినేతల వరకు తిట్ల పురాణాలతో దుమ్మెత్తి పోసుకున్నారు. మొత్తానికి ఎన్నికలు ముగిసాయి..వైసీపీ అఖండ విజయం సాధించింది.  ఏకంగా 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంది.  23 స్థానలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది..మరో మూడు ఎంపీ స్థానాలు ఇలా ఏపిలో పూర్తి స్థాయిలో గత అధికార పార్టీ పతనం అయ్యింది. 

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు..తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి...నవరత్నాల అమలు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  ఇప్పుడు ఏపిలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా తయారయ్యాయి.  టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మరో ఎంపీ తో సహ 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ నేతలంతా వైసీపీ ఏంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే సాగిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు నిదర్శనం ఇదేనంటూ, విజయసాయి పక్కన కూర్చుని ఉండగా సీఎం రమేశ్, సుజనా చౌదరి భోజనం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అసలు విషయం ఏంటంటే... లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విందు ఏర్పాటు చేయగా, తెలుగు ఎంపీలందరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంలో విజయసాయి పక్కనే సీఎం రమేశ్, సుజనా కూర్చున్నారు. కాగా, విజయసాయి ఇచ్చిన విందుగా పేర్కొంటూ అవే ఫొటోలను ఆయన నివాసంలోనివిగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: