Image result for praja vedika undavalli is now taken over by ap government
ఏ సమర్ధవంతుడైన నాయకుడైనా ఎన్నికల్లో ఓటమి ద్వారా అధికారం కోల్పోతే ఎంతో కొంతైనా ప్రజా సానుభూతైనా మిగుల్చుకుంటాడు. కాని ఏపి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత ఓటమిని పొందినతీరు దానికి ముందు ఆయన ఎన్నికల కోడ్ అమలును ప్రశ్నించిన తీరు ఇతరత్రా వేషాలు ఆయన్ను ఒక జోకర్ గా మార్చేయగా ఎవరూ ఆయన పతనంపై సానుభూతి చూపకపోగా దరిద్రం వదిలిందని బై బై బాబు అంటూ ఉన్నారే తప్ప ఆయనపైగాని ఆయన పార్టీ కార్యకర్తల నుండి మంత్రి మండలి సభ్యులందరి వరకు ఎలాంటీ జాలి చూపలేదు. అంతే కాదు ఇంతకాలము చంద్రబాబు పార్టీని, సామాజిక వర్గాన్ని నెత్తినేసుకొని నడిచిన పచ్చమీడియా జనాల మదిలో నైతిక విలువలను కోల్పోయింది. 
Image result for praja vedika
దరిమిలా వీధి చర్చలనుండి శాసనసభ సమావేశాల వరకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఉండవల్లి లోని ఆయన నివాసం సమీపంలో ఉండే "ప్రజావేదిక క్యాంప్ కార్యాలయం" ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24 న జరగబోయే కలెక్టర్ల సదస్సును అదే ప్రజావేదిక పై నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారి చేసింది. 
Image result for praja vedika
ఈ మేరకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రబాబు పీఎస్‌ కి సమాచారం అందించి, ప్రజావేదికలో ఉన్న టీడీపీ సరంజామాని తరలించాలని ఆదేశించారు. నిజానికి ఉండవల్లి లోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తనకు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే ఏపీ ముఖ్యమంత్రి కి లేఖ రాశారు. అసలు ఆయన తొలి లేఖలో ప్రజా సమస్యలు ప్రస్తావించి ఉంటే దానికి ఒక విలువ ఉండేది. 

Image result for praja vedika

పార్టీ అధినేతగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రజావేదిక ప్రాంగణాన్ని తనకు నివాసంగా కేటాయిచాలని కోరారు. అయితే చంద్రబాబు లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరి కదా! ఈలోపు ఏపీ ప్రభుత్వం ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం టీడీపీ వర్గాల కు నిజంగా బలమైన షాకే! కదా! విశ్వనగరాన్ని నిర్మించ తలపెట్టి విజయసాయి రెడ్డి అన్నట్లు బూటకపు గ్రాఫిక్స్ రాజధాని నిర్మించి ప్రజలకు దృస్యాల విందు చేసిన - చంద్రబాబుకు ఇప్పుడు ఆ నేలపై నిలువ నీడైనా ఉందా! స్వంత గృహమైనా అధికారికంగానో అనధికారికంగానో అమరావతిలో లో లేని చంద్రబాబు మహానగరపు ఆలొచనలు ఇప్పుడేమౌతాయో చూడాలి.  

Image result for amaravati prajavedika

ఇప్పటికే రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో చేరడం, మరో ముగ్గురు లోక్ సభ సభ్యులు అదే దారిలో నడుస్తుండగా తగిలిన షాక్‌లో తెలుగు తమ్ముళ్ళు తేరుకోకముందే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో శరాఘాతం కాగా వారు నోటి మాట రాక అవాక్కవుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతి తరలి వెళ్లిన తరువాత ప్రభుత్వ సమావేశాలు, సదస్సుల కోసం ₹10 కోట్ల ఖర్చుతో సీఆర్డీఏ ప్రజావేదికను నిర్మించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: