కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే ఎలా ఉండాలి.. ఎంత హుందాగా ఉండాలి.  ప్రతి విషయంపై అవగాహనా ఉండాలి.  సభలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో.. దేశ అత్యున్నత సభలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో రాహుల్ గాంధీకి కొద్దిగా కూడా తెలియదు అనుకుంటా. 

 

పార్లమెంట్ సమావేశాలు మొదలైన మూడో రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిచారు.  దాదాపు గంటపాటు ప్రసంగం జరిగింది.  ఈ గంట ప్రసంగంలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.  ముఖ్యంగా యూరి ఘటన గురించి పేర్కొన్నారు. 

 

దేశానికీ సంబంధించిన విషయాలు మాట్లాడే సమయంలో, అందులోను దేశ ప్రధమ పౌరుడు పార్లమెంట్ లో మాట్లాడే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రాహుల్ ఎలా ఉండాలి.  ఒక గల్లీ లీడర్ కంటే దారుణంగా ప్రవర్తించారు. 

 

ప్రసంగం జరుగుతున్నంత సేపు రాహుల్ తన మొబైల్ ఫోన్ లో బ్రౌజ్ చేస్తూ కూర్చున్నాడు.  అప్పుడప్పుడు పక్కనే ఉన్న సోనియాతో మాట్లాడుతూ సమయాన్ని గడిపేశాడు.  ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది.  అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించారని ట్రోల్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: