పార్టీల ప్రహరీ గోడలు దూకేసే వారిపై ప్రముఖ సినీనటి చిత్ర సీమను ఏకచత్రాధిపత్యంగా ఏలిన కథానాయిక కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, టీ-పీసీసీ చైర్‌-పర్సన్ విజయశాంతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఈ ఫైర్ బ్రాండ్ తమ ఇష్టంవచ్చినట్లు నేతలుపార్టీలు మారడానికి, ఆయా పార్టీల నిర్ణయాలే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. సిద్ధాంతాల కోసం ఉన్న కార్యకర్తలను పక్కనపెట్టి, వ్యాపార అవసరాలతో కొన్ని పరిమితులున్న పెద్దలకు పార్టీలో ప్రభుత్వం లో కీలక పదవులు ఇవ్వడం వల్లే ఇలాంటి దుష్పరిణామాలతో కూడిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. 



ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ-టీఆర్ఎస్, రెండూ కూడా అదే రకమైన అంటే ఫిరాయింపుల ధోరణి తో ఉన్నాయని అన్నారు డీఎంకే-అన్నాడీఎంకే పార్టీల తరహాలో టీఆర్ఎస్ ఉండాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు, మూడు తరాల నుంచి డీఎంకే, ఏఐఏడీఎంకేలు అనుసరిస్తున్న గుణాత్మక రాజకీయ విధానాన్ని అర్థం చేసుకోకుండా, అక్కడి తరహాలో సాంస్కృతిక, సమున్నత ప్రాంతీయ ఆత్మగౌరవ వ్యవస్థను, నిర్మించకుండా కేవలం ఆ పార్టీలను తలుచుకుంటే నామస్మరణ చేస్తే సరిపోదని ఎద్దేవా చేశారు.
 


కేవలం ప్రసంగాలతో కేసీఆర్ కాలక్షేపంచేస్తే, సరిగా ఏపీలో టీడీపీకి ఎదురైన ధారుణ విపరిణామాలు, భవిష్యత్తులో తెలంగాణ లో టీఆర్ఎస్‌ కు ఎదురు కాక తప్పదని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రెండు ప్రాంతీయ పార్టీలు సమర్థవంతమైన పార్టీలైతే జాతీయ పార్టీలకు స్థానం దొరకదనేది పచ్చి యదార్ధమని అన్నారు విజయశాంతి.  కానీ రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే, ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్టాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవమని అన్నారు. సీఎం కేసీఆర్ దీన్ని అర్థం చేసుకో గలరని అనుకుంటున్నానని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

Image result for vijayashanti about kcr party pirayimpulu

టీఆర్‌ఎస్ పార్టీ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, డీఎంకే మాదిరి టీఆర్‌ఎస్ తయారుకావాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి ప్రస్తుతం 1400 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారని కేసీఆర్ తెలిపారు. అక్కడ ఒక్కో కుటుంబం నుంచి మూడు నాలుగు తరాలు ఆ పార్టీలో పనిచేస్తారని చెప్పారు. వారు తరుచుగా పార్టీలు మారబోరని, సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, పార్టీ స్థాపించిన లక్ష్యం కోసం పనిచేస్తారన్నారు. అందుకే అక్కడ వేరే పార్టీలకు అవకాశం లేకుండా ఆ రెండు పార్టీలే అధికారంలో ఉంటున్నాయన్నారు కేసీఆర్ . డీఎంకే స్థాపించిన నాటి నుంచి అంత పటిష్ఠంగా పార్టీని తయారుచేశారని కేసీఆర్  చెప్పిన సందర్భంలో విజయశాంతి పైవిధంగా స్పందించారు

మరింత సమాచారం తెలుసుకోండి: