వైకాపా మినహా రాష్ట్రంలో మరో పార్టీ పెద్దగా యాక్టివ్ గా లేదు.  తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులను కాపాడుకునే పనిలో పడిపోయింది.  ఎంతమంది పార్టీతో ఉంటారు.  ఎంతమంది పార్టీ నుంచి దూరం అవుతారు అన్నది తెలియాలి. 

 

మరోవైపు బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయినా... టిడిపి నాయకులకు, ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది.  వాళ్ళను తమవైపు తిప్పుకునే పనిలో పడిపోయింది.  టీడీపీ నుంచి ఇప్పటికే కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు.  టిడిపికి ప్రత్యామ్నాయం బీజేపీ అని వీళ్ళు నమ్ముతున్నారు. 

 

ఇదిలా ఉంటె, జనసేన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది.  తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుంది అనుకున్నారు.  కానీ, ఆ దిశగా పవన్ అడుగులు వేయలేకపోతున్నారు.  నేతలను ఆకర్షించే దిశగా పావులు కదపలేకపోతున్నారు.

 

ఇలాగే కదలకుండా ఒకే చోట ఉండిపోతే.. పార్టీ ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.  పార్టీ బలోపేతం కావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే మంచిది.  లేదంటే మాత్రం పవన్ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మరి పవన్ మనసులో ఏముందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: