వైసీపీ ఎమ్మెల్యే రోజా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజకీయాల్లో ఐరెన్ లెగ్ అంటూ కొంద‌రు ఇబ్బంది పెట్టినా 2014 ఎన్నికల్లో నగరి నుంచి వ‌రుస‌గా విజయం సాధించి త‌న స‌త్తా చాటుకున్న ది రోజా ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వివిధ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయిన జ‌గ‌న్‌..ఇప్పటికే రోజాకు ఏపీఐసీసీ చైర్మన్ పదవిని కూడా అప్పగించారు. అటు ప్రజలకు నవరత్నాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూసే బాధ్యతను కూడా సీఎం జగన్ రోజాకు అప్పగించే అవకాశం కూడా ఉందని చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ త‌రుణంలోనే...ఆమె అమ‌రావ‌తిలో నూత‌న గృహ‌ప్ర‌వేశం చేశారు.

 

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, త‌న‌కు రెండు కీల‌క ప‌ద‌వులు ద‌క్కిన నేప‌థ్యంలో వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడలో ఇల్లు తీసుకున్నారు. కొత్త ఇంట్లోకి ఆమె భర్తతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో రోజా, భర్త సెల్వమణితో కలిసి పూజలు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గతంలో నగరిలో కూడా ఆమె ఇల్లు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: