ఎ.పి.ఐ.కె.పి. యానిమేటర్స్ ఆత్మహత్య

అధికార పార్టీ నాయకులు వేధింపులు, ఉద్యోగం నుండి అక్రమంగా తొలగించడంతో మనస్థాపానికి గురైన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ముచ్చర్లపల్లి కి చెందిన యానిమేటర్ శశికుమార్ శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకొనిఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలోని 26 వేలమంది యానిమేటర్లు  తీవ్ర దిగ్ర్భాంతి కి గురయ్యారు. శశికుమార్ బలవన్మరణానికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ శెట్టూరు మండలంలోని యానిమేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.


 తాము ఎన్నికల్లోగెలిచి అధికారంలోకి వస్తే ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలకు  పాల్పడబోమని స్వయంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసారని ఆ మండల యానిమేటర్లు చెబుతున్నారు. అయితే దానికి  భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా యానిమేటర్ల అక్రమ తొలగీంపులు పెద్ద ఎత్తున కొనసాగుతుండటం దారుణమని వారు వాపోతున్నారు. 


తక్షణమే ముఖ్యమంత్రి  స్పందించి శశికుమార్ మృతికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, దోషులను వెంటనే అరెస్టు చేయాలి, మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియో క్రింద ప్రకటించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  అతని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ మివ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ తొలగింపులను నివారించాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని యానిమేటర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: