- సామాజిక పెట్టుబడి నిధిపై విజిలెన్స్ ఆ రా....
 పార్వతిపురం వెలుగు గిరి యాజమాన్య పథకం పరిధిలో లో సామాజిక పెట్టుబడి నిధి మొత్తాలు తిరిగి చెల్లింపు అంశంపై నిఘా అధికారులు  దృష్టి సాధించారు. దీనిపై గత రెండు నెలలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ స్వశక్తితో ఉపాధి పొందేందుకు వీలుగా సామాజిక పెట్టుబడి నిధి నుంచి రుణాలను అందిస్తారు.


 రెండు సంవత్సరాల తర్వాత ఈ మొత్తాన్ని నీ వడ్డీతో కలుపుకొని వంతుల వారీగా మండల సమాఖ్య కు చెల్లించాల్సి ఉంటుంది. 2018 వరకు స్వయం సహాయక సంఘాలకు అందించిన సిఐఎఫ్ రుణాలు కాల పరిమితి దాటి పోయిన  తిరిగి చెల్లింపులు జరగడం లేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది .మొత్తం రూ 7 41 77 ,  246 లు బకాయిలు ఉన్నట్లు కనుగొన్నారు.


 ఉప ప్రణాళిక ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లో లో 1693 స్వయం సహాయక సంఘాలకు 898 96 0 93 పెట్టుబడి నిధి కింద అ అందించారు. ఇందులో లో 896 సంఘాలు తమ చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం లేదు. కేవలం ఒకటి 57 18 847 లు  మాత్రమే తిరిగి వసూలు అయిందని గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని గత నెలలో విజిలెన్స్ అధికారులు సూచనలు జారీ చేశారు. 


దీనిపై యంత్రాంగం వెంటనే స్పందించింది ప్రాంతీయ విజిలెన్స్ అధికారి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన సూచన మేరకు ఉప ప్రణాళిక మండలంలోని అందరూ ఏపిఎం లకు క్షేత్ర స్థాయి సిబ్బంది కి సామాజిక పెట్టుబడి నిధి బకాయిలను వసూలు చేయడానికి వీలుగా సమాఖ్యలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: