సంక్షోభాలు కొత్త కాదు అంటే వాటిని పదే పదే ఆహ్వానించడమా. . అయినా ఏ వయసుకు ఆ ముచ్చట అని ముప్పయిల్లో చేసిన పోరాటాలు డెబ్బైల్లో చేయడం అంటే కష్టమే మరీ. అయినా తరం మారింది. రాజకీయమూ మారుతోంది. ఇప్పటి జనం తీరే వేరు ఔట్ డేటేడ్ పాలిటిక్స్ కి అడ్డంగా బ్రేక్ వేసేస్తున్నారు.


విషయానికి వస్తే సిక్కోలుకు చెందిన ఎంపీ రామ్మోహ‌న్నాయుడుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి వద్దే వద్దుట. తాను ఇలాగే హ్యాపీగా ఉంటాను పార్టీని తగిన న్యాయం చేస్తాను అంటున్నట్లుగ్గా టాక్.  అయితే ఆయన్ని ఆ పదవికి ఒప్పించమని బాబు గారు అచ్చెన్నాయుడుకు ఆర్డరేసి మరీ యూరప్ చెక్కేశారు. ఇపుడు బాబాయి మీద ఆ బాధ్యత పడింది.


ఇంతకీ జూనియర్ ఎర్రన్నాయుడు ఆ పదవి ఎందుకు వద్దంటున్నట్లు అన్నది పెద్ద డౌట్. అధికారం పోయిన పార్టీలో పదవులకు విలువ ఏముంటుంది అన్నది ఓ పాయింట్. పైగా పేరుకు జాతీయ అధ్యక్షుడే కానీ బాబు గారు డైలీ ఏపీ పాలిటిక్స్ చక్కబెడుతూనే ఉంటారు. ఇక కుర్ర ఎంపీకి పనేముంటుంది. ఈ రెండూ కాక మ‌రోటి కూడా ఉందని అంటున్నారు. ఈ కుర్ర ఎంపీ ఏకంగా బీజేపీ పెద్దల ద్రుష్టిలో పడ్డాడుట. వారే కన్ను గీటి మరీ పిలుస్తున్నారుట. ఆ సంగతి తెలిసే బాబోరు ముందర కాళ్లకు బంధం వేస్తున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: