ఏది చేసినా చెప్పినా ధీమా ఉండాలి. అది ఉన్నపుడే వ్యవహారం చెల్లుబాటు అవుతుంది. అపుడే పరపతి పెరుగుతుంది. పరువు కూడా నిలుస్తుంది. ఏవో చెప్పాములే అన్నట్లుగా ఉంటే తేడా ఏముంటుంది. అలాగని భారీ బడ్జెట్ మూవీ లా ఆర్భాటం చేసినా అసలు సరుకు ఉండాలిగా.


వైఎస్ జగన్ సర్కార్ తొలి బడ్జెట్ వచ్చే నెల 12న ప్రవేశపెట్టబోతోంది. ఏ బడ్జెట్ లో అన్నీ మెరుపులే. గత సర్కార్ లో అరుపులు ఉంటే మావి మెరుపులు అంటున్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గున రాజేంద్రనాధ్ రెడ్డి. ఏకంగా రెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లుగా ఆయన చెప్పారు. నవరత్నాలే తమ ప్రాధాన్యత అంటున్నారు. తాము సంక్షేమం, అభివ్రుద్ధి రెండూ సమంగా చూస్తామని హామీ ఇచ్చారు.


ఈ సంగతి సరే కానీ రెండు లక్షల కోట్లు అంటే అంత బడ్జెట్ ఎక్కడ ఉంది. అసలే లోటుతో ఏపీ ఉంది. మరి దీని మీద కూడా ఆర్ధిక మంత్రి వివరణ ఇస్తున్నారు. ఉన్న ఖర్చులు తగ్గించుకుని అవసరమైన వాటికే పెట్టడం, కేంద్రం నుంచి రావాల్సిన వాటి కోసం పోరాడడం, ప్రత్యేక హోదా కోసం గట్టిగా ట్రై చేయడం ఇలా ఎన్నో చేస్తాం, ప్రజలకు మాత్రం హామీలు తీరుస్తామని ధీమాగా చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: