ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ వ్యూహాలు పదును తేరి ఉంటాయి. గురి పెడితే టార్గెట్ కొట్టాల్సిందే. ఆయన ఏది అనుకున్నా జరిగిపోతుంది. పక్కా ప్లాన్ అన్నది బాబు కే సొంతం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అంటారు.


అటువంటి చంద్రబాబు మొత్తం రాజకీయ జీవితంలో ఎదురు చూడని చేదు అనుభవాలు ఇపుడు  చూస్తున్నారా. ఇక్కడ జగన్ 151 సీట్లతో గట్టిగా ఉన్నారు. అక్కడ మోడీ రెండవసారి బంపర్ మెజారిటీతో విజయగర్వంతో ఉన్నారు. మరో వైపు రెండవమారు అధికారంలోకి వచ్చి టీయారెస్ కేసీయార్ కూడా బలంగా ఉన్నారు.


ఇలా ముగ్గురు శత్రువులు మోహరించిన వేళ‌ దేశంలో శాంతి లేదు. పోనీ విదేశాల్లోనైనా నాలుగు రోజులు ఉందామనుకుంటే నలుగురు ఎంపీల ఫిరాయింపుల రచ్చ బొప్పి కట్టిస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా పార్టీలోని మాజీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగులు, మరో వైపు ఉన్న ఎమ్మెల్యేలు చేజారుతున్న వైనం. ఇది చంద్రబాబు రాజకీయ జీవిత చరమాంకంలో పట్టి పీడిస్తున్న దారుణమైన విషయాలే. కలవరపెడుతున్న వైనాలే. మరి బాబు ఇపుడు కూడా లేచి నిలబడి తొడకొడితే మాత్రం ఆయన రాజకీయ చతురతకు హాట్సాఫ్ అనాల్సిందే. కానీ ఆ సీన్ ఉందా... తమ్ముళ్ళకే డౌట్ కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: