ఇసుక అక్రమ రవాణాపై పై మరింత నిఘా పెంచాలని అక్రమంగా తరలించి వారిపై కేసు నమోదు చేయాలని సంయుక్త కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు.  తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.


 ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఉ గృహనిర్మాణ దారులు తగిన ఆధారాలు సమర్పించి అనుమతి తీసుకున్న తర్వాతే ఇసుక తీసుకు వెళ్లాలన్నారు. ముందుగా అ సంబంధిత తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని 48 గంటల్లో లో అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మండల తాసిల్దార్ లు సబ్ ఇన్స్పెక్టర్లు కలిసి ఇ రీచ్ లను ఇసుక లభించే ప్రాంతాలను పరిశీలించాలన్నారు.


 అనుమతి లేకుండా వాహనాల్లోనూ ఎడ్ల బండి మీద అ అక్రమంగా ఇసుక రవాణా కాకూడదని స్పష్టం చేశారు. దీనిపై పై రవాణా దార్లకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు కు ఈ పద్ధతి కొనసాగుతుందని స్పష్టం చేశారు అక్రమ రవాణాను అరికట్టేందుకు 24 గంటలు గట్టి నిఘా పెట్టాలని సూచించారు.


 పత్రికల్లో వచ్చిన కథనాలపై వెంటనే స్పందించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ నెల్లిమర్ల గుర్ల ఎస్ కోట తహసిల్దార్లు గ్రామీణ నీటి సరఫరా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: