అనాదిగా అభివృద్ధికి నోచుకోని గిరిపుత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన కానుకను ప్రకటించింది. ఈ విషయాన్ని గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్ఫశ్రీవాణి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవ తీసుకుని గిరిజనులకు సకాలంలో చేయూత అందించేదుకు ఏటా 300 మందికి పెళ్లికానుకకు శ్రీకారం చుట్టారు. 


విజయనగరం గిరిపుత్రులకు వైయస్సార్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు సాయం అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  పాముల పుష్ప శ్రీ వాణి ప్రకటించారు. అమరావతిలో ఆమె బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా  రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అభినందించారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఆమె ప్రజల కోసం వైఎస్ఆర్ పెళ్లి కానుక ప్రకటించారు. దీంతో గిరిజనులు సంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు.  ఈ పథకం ద్వారా పార్వతిపురం ఏజెన్సీలో ఏటా 300 మంది ఆదివాసీ యువతకు లబ్ధి చేకూరుతుంది. 


గతంలో టిడిపి ప్రభుత్వం కల్యాణ పథకం కింద అ ఆదివాసి వధూవరుల వివాహ కుర్చీలకు రూ 50 వేలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ నీ రెండేళ్లుగా పథకానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో పెళ్లి చేసుకున్న నా గిరిజన వధూవరులు కల్యాణ పథకం కింద ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నవరత్నాలు లో భాగంగా అనేక సంక్షేమ పథకాలు అమలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గిరిపుత్రులకు పెళ్ళి కానుక కింద రూ లక్ష మంజూరు చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: