2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగితే ఈసారి ఆ పార్టీ 52 స్థానాలు గెలుచుకొని కాస్త మెరుగు అనిపించింది.  అయితే, అధికారం చేజిక్కించుకోవాల్సిన స్థానాలు మాత్రం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు.  


దీనికి కారణం లేకపోలేదు.  మోడీ బలమైన నాయకుడిగా ఎదగడం ఒకటైతే.. ఎలాంటి విషయాలను అనుకూలంగా మార్చుకోవాలో మోడీకి తెలిసినంతగా రాహుల్ గాంధీకి తెలియకపోవడం మరొకటి.  మోడీ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు.  


తీసుకున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు.  రాహుల్ అలాంటి విషయాలను డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.  యూరి, సర్జికల్ స్ట్రిక్స్ వంటి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మోడీ సక్సెస్ అయ్యారు.  కానీ, రాహుల్ మాత్రం వాటి గురించి అసలు మాట్లాడకపోవడం విశేషం.  కేవలం డిజిటల్ ఎనాలిసిస్ ను మాత్రమే నమ్ముకోవడంతో రాహుల్ వెనకబడిపోయారు.  


డిజిటల్ ప్రసారం కోసం ముఖ్యంగా ఎస్ఎంఎస్ వంటి వాటికోసం ఏకంగా కాంగ్రెస్ పార్టీ 19 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.  ఇందులో 7 లక్షల రూపాయల విలువచేసే ఎస్ఎంఎస్ లు అసలు డెలివరీ కాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు.  కేవలం కృత్రిమ మేధస్సు మాత్రమే నమ్ముకోవడం రాహుల్ గాంధీ ఓటమికి ఒక కారణం అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: