వైసీపీ పార్టీలో కీలక నేత రోజా . జగన్ తన మొదటి క్యాబినెట్ లో మంత్రిగా స్థానం దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ కొన్ని సామజిక కారణాల రీత్యా రోజాకు అవకాశం దక్కలేవు. అయితే ప్రస్తుతం రోజా గారు ఏపీఐఐసి చైర్మన్గా నామినేటెడ్ పదవిలో కొనసాగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవితో పాటు మరో ముఖ్యమైన పదవి భాద్యతలను రోజా గారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నవరత్నాలను సక్రమంగా అమలుపరిచేలా మరో పదవిని రోజాగారికి అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రోజా గారు ఎమ్మెల్యేగా నగరి నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నారు. ఇది కాక ఏపీఐఐసి చైర్మన్గా , జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఇన్ని భాద్యతలు రోజా గారి మీద ఉండటంతో అన్నిటికీ సమయం కేటాయించటం చాలా కష్టమైన విషయం.


రోజాకు ఇన్ని బాధ్యతలు అప్పగించిన జగన్  .. తరువాత రెండున్నరేళ్ల తరువాత రోజా క్యాబినెట్ లో స్థానము దొరకటం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు కూడా సామాజిక కారణాలు అడ్డొస్తే పరిస్థితి ఏంటి .. ఎందుకంటే చిత్తూర్ నుంచి రెడ్డి సామాజిక వర్గం అయినా పెదిరెడ్డి ఎలాగూ ఉంటాడు .. భూమనా కరుణాకరన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేస్ లో  ఉన్నారు. కాబట్టి ఇంత మంది రెడ్డి సామాజిక వర్గం నుంచి అందరికి మంత్రి పదవులు దక్కక పోవచ్చు. కాబట్టి మళ్ళీ రోజాకు మంత్రి పదవి విషయంలో షాక్ తప్పదని కొందరు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: