మొదటి నుండి కూడా తెలుగుదేశంపార్టీకి రాజ్యసభ పదవులు పెద్దగా అచ్చి రాలేదనే చెప్పాలి. పార్టీ పెట్టినప్పటి నుండి కూడా టిడిపి తరపున రాజ్యసభ సభ్యులైన వాళ్ళల్లో అత్యధికులు పార్టీని దెబ్బకొట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. సుమారుగా 15 మంది నేతలు టిడిపిని దెబ్బ కొట్టారు.

 

పార్టీ తరపున రాజ్యసభ సభ్యులైన వాళ్ళల్లో కంభంపాటి రామ్మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు కొనసాగుతున్నారంటే జనబలం లేని వాళ్ళు కాబట్టే అని పార్టీ నేతలే చెబుతున్నారు.

 

పార్టీకి ఉన్న ఆరుగుర రాజ్యసభ సభ్యుల్లో తాజాగా నలుగురు ఎంపిలు పార్టీని వదిలేశారు. మిగిలిన ఇద్దరు సీతా రామలక్ష్మి, కనకమేడల రవీంద్ర మాత్రమే ఇప్పటికి టిడిపిలో ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఎందుకున్నారంటే పై సమాధానమే చెప్పుకోవాలి. పైగా ఓటింగ్ విషయంలో తప్ప ఇతరత్రా ఏ విధంగా కూడా బిజెపికి  ఉపయోగపడరు.

 

పర్వతనేని ఉపేంద్ర, జయప్రద, వంగాగీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజి, మోహన్ బాబు, తులసీరెడ్డి, మైసూరారెడ్డి, రామమునిరెడ్డి, సి రామచంద్రయ్య, రేణుకా చౌదరి, మందా జగన్నాధం కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారే. తాజాగా సుజనాచౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ కూడా అలాగే వెళ్ళిపోయారు.

 

ఇక పార్లమెంటరి పార్టీ నేతలుగా పనిచేసిన పి. ఉపేంద్ర, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రేణుకా చౌదరి, మందా జగన్నాధంతో పాటు తాజాగా సుజనా చౌదరి కూడా పార్టీ నుండే జంపయిపోయారు. అంటే రాజ్యసభ సభ్యులే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా టిడిపి అచ్చి రావటం లేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: