లోకేష్ చంద్రబాబు కుమారుడు. అటు కుటుంబానికీ, ఇటు పార్టీకి కూడా ఏకైక వారసుడు. లోకేష్ రాజకీయం అంతా 2014 నుంచి మొదలైందని చెప్పాలి. అంతకు ముందు తెరచాటు వ్యవహారమే. ఇక  అయిదేళ్ళ కాలంలో రెండేళ్ళ పాటు మంత్రిగా కూడా చినబాబు చక్రం తిప్పారు. ఓ దశలో కాబోయే సీఎం లోకేష్ అన్న మాట కూడా గట్టిగా  వినిపించింది.


నిజానికి చంద్రబాబు మీద జనాల్లో పూర్తి స్థాయిలో వ్యతికేకత రావడానికి లోకేష్ ఓ ప్రధాన కారణంగా చెబుతారు. ఏ అనుభవం లేని లోకేష్ కి అన్నేసి మంత్రిత్వ శాఖలు ఇచ్చి దొడ్డి దారిని మంత్రిని చేసిన దానికి ప్రతిగానే జనం టీడీపీని ఓడినారని కూడా అంటారు. ఇక మరో మారు టీడీపీకి అధికారం అప్పగిస్తే లోకేష్ ని బాబు సీఎం చేసినా చేస్తారన్న భయంతోనే మొత్తం టీడీపీని  ఓడించారన్నది  కూడా పార్టీలో చర్చగా వుంది.


ఇదిలా ఉండగా తాజాగా కాకినాడలో సమావేశమైన ఓ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు లోకేష్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు భోగట్టా. ఆయన వల్లనే పార్టీ దారుణంగా ఓడిపోయిందని వారు అంటున్నారు. బీసీలను చిన్న చూపు చూడడం, కాపులను పట్టించుకోకపోవడం వంటివి లోకెష్ చేశారని, ఆ మొత్తం ఫలితాన్ని పార్టీ అనుభవైంచిందని అంటున్నారు.


ఇక అనుభవలేమితో పార్టీని పరాజయం దిశగా తీసుకెళ్ళిన లోకేష్ ని తప్పిస్తేనే తాము పార్టీలో ఉంటామని కూడా అల్టిమేటం ఇవ్వబోతున్నారు. బాబు విదేశాల నుంచి తిరిగివచ్చాక ఈ పంచాయతి పెట్టబోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ లోకేష్ ని టార్గెట్ చేస్తుందనుకుంటే ఇలా సొంత పార్టీ తమ్ముళ్ళే లోకేష్ ని పొమ్మనడం  టీడీపీలో మారనున్న రాజకీయానికి ఉదాహరణ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: