తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు జగన్ సర్కార్ నుంచి, ఆదిలోనే చుక్కెదురైంది. ఉండవల్లి లోని తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రతిపక్ష నేతగా వినియోగించడానికి  అవకాశం కల్పించాలని అయన,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరిన విషయం తెల్సిందే. అయితే ప్రజావేదిక ను చంద్రబాబు కు కేటాయించేందుకు జగన్ సర్కార్ ఏమాత్రం సుముఖంగా ఉన్నట్లు కన్పించడం లేదు.


ప్రజావేదిక కేటాయింపు గురించి నేరుగా ప్రభుత్వం  ఎటువంటి సమాధానం చెప్పకపోయినా, ఈ నెల 24 వతేదీన కలెక్టర్ల సమావేశాన్ని అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ప్రజావేదిక లో ఉన్న టీడీపీ సామాగ్రిని తొలగించాలని ఆ పార్టీ నేతలకు సమాచారం అందజేయడమే కాకుండా, కలెక్టర్ల సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో ప్రజావేదిక ను ప్రతిపక్ష నేతకు కేటాయించేది లేదని జగన్ సర్కార్ చెప్పకనే చెప్పినట్లయింది.


ప్రజావేదిక ను కేటాయించాలని  ప్రతిపక్ష నేత చంద్రబాబు నేరుగా ముఖ్యమంత్రిని కోరిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఆయన విజ్ఞప్తి ని తిరస్కరించడం పట్ల తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజావేదికను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించడం వల్ల చంద్రబాబు భద్రత ప్రమాదం లో పడే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ఎవరెవరు హాజరవుతారన్న ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వమే వద్దనే ఉండదని, అటువంటప్పుడు గతం లో ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి  భద్రత ప్రమాదం లో పడే ఆస్కారం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: