గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు పథకాల అమలు కోసం వేసిన జన్మభూమి కమిటీలు ఎన్ని విమర్శలు పొందాలో అన్ని విమర్శలు పొందాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి జన్మభూమి కమిటీలు కూడా ఒక కారణం. పథకాల అమలులో అక్రమాలు చోటు చేసుకోవటం మరియు టీడీపీ పార్టీ వాళ్ళకు మేలు చేకూరేలా చేయటం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
2019 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తరువాత జన్మభూమి కమిటీల్లా కాకుండా పథకాల అమలు కోసం గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నాడు. కానీ సోషల్ మీడియాలో ఈ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు వైసీపీ పార్టీ చెందిన వారికి మాత్రమే ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ అంటే గిట్టని వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. 
 
నిజానికి జగన్మోహన్ రెడ్డిగారు మొదటినుండి ప్రతి పథకాన్ని అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా జరిగేలానే చేస్తున్నారు. మంత్రులకు కూడా వారి శాఖల్లో అవినీతి జరగకుండా చూసుకోవాలని అవినీతి జరిగినట్లు తెలిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు కూడా స్పష్టమైన విధి విధానాలను రూపొందించారు. అందువలన ఈ ప్రక్రియ అంతా ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగానే జరగబోతున్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: