పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత  జనసేన పార్టీ భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. కనీసం పది సీట్లైనా వస్తాయి అనుకున్నారు. కానీ జనసేన ఒకే ఒక్క సీటు గెలిచింది.

 

పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. భీమవరం ,గాజువాక నియోజక వర్గాల్లో ఓడిపోయాడు. చివరికి జనసేనలో చేరిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది అర్థం కావట్లేదు.

 

 

మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీచేసాడు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేక, సినిమాలు, టీవీ షోలతోనే సరిపెట్టుకుంటారా? అనే సందేహాలు కలిగాయి. వాటిన్నింటికి నాగబాబు వివరణ ఇచ్చారు. తాను రాజకీయాల్లో కొనసాగుతానంటూ స్పష్టం చేశారు.

 

అలాగే జనసేన పార్టీకి తీవ్ర నిరాశాజనక ఫలితాలు లభించడంతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి క్లారిటీ ఇచ్చారు. “కల్యాణ్ బాబు ఓ సారి తాను సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ అందులోకి రారు. మా అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కల్యాణ్ బాబు అలా కాదు, సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారు” అంటూ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: