దాదాపు మూడు దశాబ్దాలుగా రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సేవలను రాజ్యసభ కొనియాడింది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యసభ శుక్రవారం తొలిసారి సమావేశమైంది.

 

మన్మోహన్‌సింగ్‌తోపాటు మరో ఎంపీ శాంతిష్యు కుజుర్ పదవీకాలం ఈనెల 15తో ముగిసినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. వీరివురు ఎనలేని సేవలు అందించారని, సభ గౌరవం పెంచారని ఆయన ప్రశంసించారు. వారిద్దరూ లేకపోవడం సభకు లోటు అని చెప్పారు.

 

మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారని, వరుసగా రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. వారివురి సేవలను ప్రశంసిస్తూ రికార్డుల్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. అంతకుముం దు, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్‌తోపాటు మరో తొమ్మిది మంది సభ్యుల మృతికి సభ నివాళులర్పించింది.

 

సున్నిత, మృదు స్వభావి అయి న మన్మోహన్.. పలు అంశాలపై, ముఖ్యంగా సంక్షేమం, దేశాభివృద్ధికి సంబంధించిన ఆర్థిక అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొని సభ జ్ఞానాన్ని పెంచారని ప్రశంసించారు. అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్, ప్రఖ్యాత ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్‌ను ఈ సభ మిస్ అవుతున్నదని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: