వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం కాబట్టి నమ్మాల్సిందే. ఇక్కడ సొంత మ్యాగజైన్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అన్నమాట. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రింట్ అయ్యే మ్యాగజైన్ కాబట్టి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఉండదని వేరే చెప్పక్కర్లేదు. సిఎంగా ఎవరున్నా జరిగేదిదే.

 

కానీ మొన్నటి జూన్ ఎడిషన్లో మాత్రం జగన్ ను కించపరుస్తు ముఖచిత్రంతో పాటు రెండు వ్యాసాలు కూడా వచ్చాయట. ఈ మ్యాగజైన్ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. అలాంటిది మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ కందుల రమేష్ పైత్యంతో జగన్ కు అవమానం జరిగినట్లు ప్రభుత్వ పెద్దలు మండిపోతున్నారు.

 

జగన్ ప్రమాణస్వీకారానికి మించిన కార్యక్రమం ఏపి మ్యాగజైన్ కు ఏముంటుంది ? అలాంటిది జూన్ ఎడిషన్లో జగన్ ప్రమాణ స్వీకారం ఫొటోను కలర్లో కాకుండా బ్లాక్ అండ్ వైట్ లో ముద్రించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ చెప్పిన ‘జగన్ అను నేను’ అనే పదం ఎంత పాపులరైందో అందరికీ తెలిసిందే. అలాంటిది హెడ్డింగ్ లో ‘జగన్ అనే అతడు’ అని కావాలనే పెట్టారట. 

 

అలాగే ప్రమాణస్వీకారం తర్వాత జగన్ ను విజయమ్మ హత్తుకుని కన్నీళ్ళు( ఆనందభాష్పాలు) పెట్టుకున్న విషయం అందరూ చూసిందే. అలాంటిది తల్లిని హత్తుకుని జగన్ ఏడ్చేశారంటూ రాశారు. జగన్ గురించి ఇంత చులకనగా ఎందుకు రాశారంటే మ్యాగజైన్ ఎడిటోరియల్ బోర్డు మొత్తం చంద్రబాబు భజన బృదంతో నిండిపోయింది. వారెవరికి టిడిపి ఓడిపోవటం ఏమాత్రం ఇష్టం లేనట్లుంది.

 

టిడిపి ఘోరంగా ఓడిపోవటం, వైసిపికి అఖండ మెజారిటీ రావటాన్ని వీళ్ళెవరూ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే జగన్ ప్రమాణస్వీకారంపై అంత చులకనగా ఫొటోలేసి స్టోరీలిచ్చారు. ఓ వ్యక్తిపై అభిమానం ఉండటంలో తప్పేమీ లేదుకానీ అది శృతిమించి పైత్యం దశకు చేరుకోవటం మాత్రం అభ్యంతరకరమే. మొత్తానికి ఈ మ్యాగజైన్ జగన్ దృష్టిలో పడగానే మండిపోయారట. దాంతో మ్యాగజైన్ మార్కెట్ లోకి రాకముందే నిలిపేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: