గత కొన్నాళ్ళుగా ఆ మాజీ మంత్రి మీద రూమర్లు అలా వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆయన అధికారంలో ఉన్నపుడు కూడా వదలకుండా మీడియా వెంటపడింది. ఆయన అలా చేస్తారు, ఇలా చేస్తారు అంటూ కధనాలు వండి వడ్డించింది. ఇక ఇపుడు మరీ ఎక్కువగా రాస్తోంది.


దీంతో ఆ మాజీ మంత్రి గారు ఫుల్ క్లారిటీగా వివరణ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉంటాను, పార్టీ మారను అంటూ గంటా శ్రీనివాసరావు పక్కాగా చెబుతున్నారు. అసలు ఎందుకు పార్టీ మారాలి ఇదీ గంటా వారి ప్రశ్న. తనకు ఆ అవసరం లేదని, అధికారం పై మక్కువ కూడా లేదని ఆయన కామెంట్స్ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రతిపక్షంలో ఉంటే చాలు అంటున్నారు.


మరి గంటా ఈ విధంగా చెప్పడం వల్ల టీడీపీకి గుండె గుబులు తగ్గుతుందా. కంగారు పడకుండా ఇకపై హ్యాపీగా ఉండొచ్చా. అంటే చెప్పలేమనే వారే ఎక్కువ. ఎందుకంటే గంటా గతంలో పార్టీలు మారిన చరిత్ర ఉంది. ఆయన అపుడు నేనెందుకు పార్టీ మారాలి అని అనుకోలేదు. ఇపుడు అడుగుతున్నారు అంటే బయట ఎక్కడా వర్కౌట్ కాలేదా లేక కొన్నాళ్ళు వ్యూహాత్మకంగా మౌనంగా ఉండాలనుకుంటున్నారా. కొత్త డౌట్లు ఇలా పుట్టుకువస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికైతే గంటా పార్టీ మారను అన్నారు. దాంతో టీడీపీ సేఫ్ గా ఉండొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: