కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఓ ఆఫర్‌ను ఇచ్చింది. నీటి ఎద్దడితో బాధపడుతున్న చెన్నై వాసుల దాహార్తి తీర్చేందుకు 20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని పేర్కొంది. ఈ ఆఫర్‌ను తమిళనాడు ప్రభుత్వం మొదటగా తిరస్కరించింది.

 

కాగా కేరళ ఇచ్చిన ఆఫర్‌పై సీఎం పళనిస్వామి నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి వేలుమణి తాజాగా తెలిపారు. తమిళనాడు కోరితే రైలు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని కేరళ సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే.

 

కేరళ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించడం అవివేకమని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏఐఏడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథన్‌ నేడు రాజ్యసభలో మాట్లాడుతూ.. క్రింది విషయాన్ని పేర్కొన్నారు.

 

తమిళనాడు ప్రభుత్వం తీవ్ర నీటి కరువుతో బాధపడుతుందన్నారు. కావేరి నదే రాష్ర్టానికి ప్రధాన నీటి అవకావమన్నారు. కేంద్రం తక్షణం కల్పించుకుని కావేరీ నది నుంచి నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: