నవరత్నాలు.. జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పథకాలు.. అందుకే జగన్ వీటి అమలు కోసం కట్టుబడి ఉన్నారు. సెక్రటేరియట్ లోని తన పేషీలో ఈ నవరత్నాల హామీలపై ప్రత్యేక పోస్టర్లు తయారు చేయించి పెట్టుకున్నారు. 


ఈ పథకాల అమలే తన ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా జగన్ భావిస్తున్నారు. అందుకే.. తాజాగా నవరత్నాలు అమలు కోసం ప్రత్యేకంగా జగన్ ఓ అధికారిని నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. శామ్యూల్ ను జగన్ నవరత్నాల పథకాల అమలు కోసం ప్రత్యేక సలహాదారు హోదాలో నియమించారు. 

ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామ్యూల్ నవరత్నాల కార్యక్రమానికి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. శామ్యూల్ కు జగన్ ఏకంగా క్యాబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టారు. ఈ పదవిలో శ్యామ్యూల్ మూడేళ్లపాటు ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

మూడు సంవత్సరాల తర్వాత కూడా శ్యామ్యూల్ ను ఆయన పనితీరు బట్టి కొనసాగించే అవకాశం ఉంది. మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో నవరత్నాల పథకాల అమలు- వాటిలో వచ్చే ఇబ్బందులపై శ్యామ్యూల్ కు మంచి అవగాహన ఉంటుంది. శ్యామ్యూల్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని.. నవరత్నాలను ప్రజలకు చేరువ చేయాలన్నదే జగన్ ఆలోచన.


మరింత సమాచారం తెలుసుకోండి: