- ప్రజా వేదిక వివాదంపై  విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్
ప్రభుత్వంలొ ఇంకా ఉన్నామన్న  భ్రమలో టిడిపి నాయకులు ఉన్నారని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. విజయవాడ  ఉండవల్లిలో నిర్మించిన ఓ అత్యాధునిక భవనంలో ఏపీ మాజీ సీఎం  చంద్రబాబు నివసిస్తున్న సంగతి తెలిసిందే.  ఆయన అధికారంలో ఉండగా  పార్టీ అవసరాల కోసం,  ప్రభుత్వ  కార్యక్రమాల  నిర్వహణ కోసం ప్రజా వేదిక పేరుతో  భవనాన్ని నిర్మించారు. 2019 సాధారణ  ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పటికీ ఆ భవనాన్ని ఖాళీ చేయలేదు. 


పైగా తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని  ప్రతిపక్ష నేత కార్యాలయంగా గుర్తించాలంటూ చంద్ర బాబు జగన్ కి ఓ లేఖ రాశారు.  కానీ చంద్రబాబు  విజ్ఞప్తిని  జగన్  తిరష్కరించారు. ఈ అంశాన్ని తెలుగు దేశం పార్టీ పెద్దలు తమకు అనుకూలంగా మలచుకుని ఆ భవనాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ  వ్యవహారంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘాటుగా స్పంధించారు. అధికారం కోల్పోయాక  ప్రజా వేదికలో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. 


ప్రజా వేదికలొ విలువైన వస్తువులు ఏమున్నాయో టిడిపి నెతలు ప్రజలకు చెప్పాలని, ప్రభుత్వ అవసరాల కోసం ప్రజావేదిక తప్ప..టిడిపి ఆస్తి కాదని స్పష్టం చేశారు. ప్రజావేదిక ను టిడిపి నెతలు అనవసరంగా వివాదం చేస్తున్నారని, విలువైన ఫైళ్ళను అక్కడ పెట్టారంటే ఎవరి ఫైళ్ళు దాచోరో చెప్పాలన్నారు. ప్రజా వేదికను రాద్ధాంతం చేస్తే టిడిపి కి ఉన్న కాస్త పరువు కూడా పోతుందని హెచ్చరించారు.  


చంద్రబాబు లేని సమయంలొనే రాజ్యసభ ఇచ్చిన వాళ్లే పొయారు. ఇంకా ఫైల్ళ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. నోటీసులిచ్చారు కాబట్టి విలువైన  ఫైల్ళు ఉంటే తీసేసుకోవాల్సిందిగా సూచించారు. కలెక్టర్ల కాన్పరెన్స్  ఉండవల్లి లోనే ప్రజా వేదికలోనే 100 శాతం నిర్వహించి తీరుతామని ఎమ్మెల్యే విష్ణు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: