వైకాపా గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.  రాష్ట్రంలోని మెజారిటీ నియోజక వర్గాల్లో వైకాపా విజయం సాధించినా.. శ్రీకాకుళం, టెక్కలి వంటి స్థానాల్లో మాత్రం వైకాపా ఓటమిపాలైంది.  టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గంలో తప్పకుండా విజయం సాధిస్తుంది అనుకున్నా.. చివరి నిమిషంలో అచ్చెమ్ నాయుడు విజయం సాధించాడు.  అటు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గాన్ని కింజరపు రామ్మోహన్ నాయుడు గెలుచుకున్నాడు.

 

శ్రీకాకుళంలో టిడిపి సానుభూతి వలన ఓట్లు పడ్డాయి.  అయితే, టెక్కలిలో ఓటమికి శ్రీకాకుళం వైకాపా అధ్యక్షురాలు కిల్లి కృపారాణినే కారణం అని అంటున్నారు పేరాడ తిలక్.  ఎన్నికల సమయంలో వైకాపా శ్రీకాకుళం అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సహకారం అందించలేదని.. ఫలితంగా తాను ఓడిపోయానని, దీనిపై జగన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్తున్నాడు. 

 

అయితే, కిల్లి కృపారాణి చెప్తున్న వర్షన్ మరోలా ఉన్నది.  తాను నిస్వార్ధంగా పార్టీకోసం పనిచేశానని, ఓటమికి తానే కారణం అని చెప్పి నిందలు వేయడం సరికాదని అంటున్నారు.  నిందలు వేసే సమయంలో అలోచించి వేయాలని ఆమె వాపోతోన్నది.  ఏది ఏమైనప్పటికి.. ఎన్నికల రిజల్ట్ వచ్చి నెలరోజులు తిరక్క ముందే.. ఇలా గొడవలు రావడంతో ఆ పార్టీకి మంచిది కాదు. 

 

వీలైనంత త్వరగా ఇలాంటి గొడవలకు చెక్ పడితే బాగుంటుంది.  లేదంటే మాత్రం ఈ గొడవలు పార్టీలో కలకలం రేపుతుంటాయి.  అసమ్మతి వాదులు పెరిగిపోతుంటారు.  మరి దీనికి జగన్ ఎలా చెక్ పెడతాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: