టాలీవుడ్‌లో అగ్ర‌నిర్మాత‌గా ఇండ‌స్ట్రీని శాసిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కోరిక‌ను ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి నెర‌వేర్చేశారు. దిల్ రాజు చిరకాల కోరిక ఏంటి దానిని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చటం ఏంటి అన్న సందేహం సహజంగానే వస్తుంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాత గా ఉన్న దిల్ రాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓ సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి... ఈ రోజు టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల నిర్మాతగా దూసుకుపోతున్నారు. అటు పంపిణీ రంగంలోనూ దిల్ రాజుకు తిరుగులేదు.

దిల్ రాజుకు టిటిడి పాలక మండలిలో సభ్యుడిగా పని చేయాలని... తన ఇష్ట దైవం అయిన తిరుమల వెంకన్న సేవ చేసుకోవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందట.  దిల్ రాజు వెంకటేశ్వరస్వామి భక్తుడు ఆయన తన బ్యానర్ కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ తన బాబాయ్ మాజీ ఎంపీ, వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

వారం రోజుల్లో టిటిడి పాలక మండలి ఏర్పాటు అవుతుందని సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ కొత్త పాలక మండలిలో దిల్ రాజు బోర్డు సభ్యుడిగా నియమించే నియమితులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొన్నారుదిల్ రాజును టిటిడి పాలక మండలిలో సభ్యుడిగా నియమించడానికి ప్రధాన కారణం తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే.

అదే టైంలో దిల్ రాజు తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో పాటు... అక్కడ అధికార పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇక టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇండ‌స్ట్రీలో ప‌రోక్షంగా పెట్టుబ‌డులు పెడుతున్నార‌న్న టాక్ ఉంది. ఇప్పుడు రాజును టీటీడీ మెంబ‌ర్‌గా తీసుకోవాల‌ని కేటీఆర్ కూడా జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక టీటీడీ బోర్డులో త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, తెలంగాణ‌కు చెందిన వారిని తీసుకుంటున్నారు. తెలంగాణ కోటాలో రాజుతో పాటు మ‌రో వ్య‌క్తికి చోటు ద‌క్క‌వ‌చ్చంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: