అందరు నరకం అంటే ఎక్కడ ఉంటుంది.. ఎలా ఉంటుంది.. వామ్మో ఎన్ని కష్టాలు అనుభవించాలి.. ఎందుకు వచ్చిందిలే.. అని భయపడుతుంటారు.  అసలు నరకం అంటే ఎక్కడో లేదు.  నరకం అంటే ఎక్కడో లేదు.  ఇక్కడే ఉంది. భూమిమీద మనిషి పడే కష్టాలే నరకం. మాములుగా ఇంట్లో ఇంట్లో ఉండే కష్టాలను చూసి అందరు నరకం అనుకుంటారు. 

 

అసలు నరకం అంటే ఇది కాదు.  అసలు నరకం.. ఎక్కడ ఉందంటే.. హైదరాబాద్ రోడ్లపైనే ఉన్నది. అది వర్షం కురిసినప్పుడు... వర్షం కురిసినప్పుడు రోడ్డుమీదకు బైక్ వేసుకుకొని వెళ్తే.. నరకం కనిపిస్తుంది.  నరకం అంటే ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. 

 

నిన్నటి రోజున హైదరాబాద్ లో తొలకరి వాన కురిసింది.  దాదాపు అరగంటసేపు వాన కురవడంతో.. ఎక్కడ రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  ముఖ్యంగా ఐటి కారిడార్ వైపు వెళ్లే రోడ్లు.  మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే రోడ్లపై ఫ్లై ఓవర్ నిర్మిస్తుండటంతో పాటు.. అక్కడక్కడా రోడ్లు వెడల్పు చేస్తుండటంతో ఇబ్బందులు మొదలయ్యాయి. 

 

వేలాది వాహనాలు ఎక్కడికక్కడ బ్లాక్ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. కిలోమీటర్ వెళ్లేందుకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది అంటే అర్ధం చేసుకోవచ్చు. ఐటి కారిడార్ రూట్లో మాములుగా 40 నిమిషాల నుంచి గంట వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.  కానీ, నిన్న ట్రాఫిక్ జామ్ కారణంగా కనీసం 4 నుంచి 5 గంటల సమయం పట్టడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: