పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇచ్చారు. ఢిల్లీలో ఏపి ప్రభుత్వం తరపున అధికార ప్రతినిధి హోదాను విజయసాయికి ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు.  ఇప్పటికే విజయసాయి ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో రెండు పదవుల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బిజీగా ఉంటునే ఎంపిగా కూడా ఢిల్లీ స్ధాయిలో పార్టీకి అవసరమైన సేవలందిస్తున్నారు. ఇపుడు మూడో పదవి కూడా ఆయన్నే వరించింది. పైగా ఈ అధికార ప్రతినిధి అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవన్న విషయం తెలిసిందే.

 

రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగులో ఉన్న పనులు, ప్రజాక్టులు, నిధులు తదితరాలను వెంటనే వచ్చేట్లు చేయటంతో పాటు రాష్ట్ర-కేంద్రప్రభుత్వాల మధ్య అనుసంధానకర్తగా కూడా విజయసాయి వ్యవహరించాల్సుంటుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: